గోవిందరావుపేట, జూలై 4: ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన దేపాక కృష్ణ ‘ప్రజావేదిక’ అనే వాట్సాప్ గ్రూప్‌లో సీఎం కేసీఆర్‌ను కించపరుస్తూ తప్పుడు వీడియో ను పోస్టు చేశాడు. కృష్ణపై చట్టరీత్యా చ ర్యలు తీసుకోవాలని బాలాజీనగర్‌కు చెందిన లకావత్ నర్సింహనాయక్ స్థాని క పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కృష్ణపై మంగళవారం కేసు న మోదు చేసినట్టు ఎస్సై కరుణాకర్‌రావు తెలిపారు.