హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్‌పై నగర సైబర్‌క్రైమ్ ఠాణాలో కేసు నమోదైంది. ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి పరువుకు నష్టం కలిగించేలా ట్వీట్ చేశారం టూ ఎల్బీనగర్కు చెందిన శశిధర్‌రెడ్డి జూలై 30న సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్రిశాంక్‌పై ఐటీ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నా రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత క్రిశాంక్‌పై వివిధ కారణాలతో వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన కేసు ఏడోది కావడం గమనార్హం.