Car Rent | హైదరాబాద్ : ఓ వ్యక్తి అద్దెకు తీసుకున్న కార్లను తాకట్టు పెట్టిన ఘటన హైదరాబాద్‌లోని డబీర్‌పురాలో వెలుగుచూసింది. కార్లు అద్దె (Car Rent)కు తీసుకుని తాకట్టు పెట్టిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబీర్‌పురాలో నిందితుడు 4 కార్లను అద్దెకు తీసుకుని వాటిని తాకట్టు (Mortgage) పెట్టాడు.
కార్లను నిందితుడు రూ.7 లక్షలకు తాకట్టు పెట్టి పారిపోయాడు. దీంతో కార్ల యజమాని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. యజమాని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ.26 లక్షల విలువ చేసే 4 కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.