శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 11:20:01

కల్వర్టు కింద పడ్డ కారు..ఏడుగురికి గాయాలు

కల్వర్టు కింద పడ్డ కారు..ఏడుగురికి గాయాలు

పెద్దపల్లి జిల్లా: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టి..కల్వర్టు కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు గాయపడ్డారు. స్థానికులు గాయపడిన వారిని అంబులెన్స్ లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ కు చెందిన ఇంజనీర్ మంథని రామకృష్ణ కుటుంబంతో మంచిర్యాల నుండి హైదరాబాదు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
logo