MLA Lasya Nanditha | కారు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత (MLA Lasya Nanditha) కన్నుమూశారు. ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్ఆర్పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు. దైవదర్శనానికి వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది.
సీనియర్ నేత, ఎమ్మెల్యే సాయన్న మరణంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందితకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కంటోన్మెంట్ సీటు ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిపై ఆమె విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయడ్డారు. నల్లగొండలో బీఆర్ఎస్ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
లాస్య నందిత.. 1987లో హైదరాబాద్‌లో జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేఏడాది జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్ఎస్లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీచేసి విజయం సాధించారు.
ఎమ్మెల్యే లాస్య కుటుంబ సభ్యుల కు హరీష్ రావు పరామర్శ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ శతకాల మోత.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
Vehicle Emissions | వాహన ఉద్గారాలపై నియంత్రణ ఎందుకు.. ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
Saudi Arabia | సౌదీ అరేబియాపై డ్రోన్లు, మిస్సైల్స్ దాడి.. ఆ వీడియోలు షేర్ చేయొద్దంటూ భారతీయులకు వార్నింగ్
Harish Rao | దివ్యాంగుల సంస్థకు రెండేళ్లుగా రూ.16 లక్షల బిల్లులు పెండింగ్.. హరీశ్‌రావు ఆగ్రహం
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

