man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
man kills live-in partner's dogs | సహజీవనం చేసిన మహిళ బ్రేకప్ చెప్పడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె పెంపుడు కుక్కలను క్రూరంగా చంపాడు. ఆ మహిళకు వీడియో కాల్ చేసి దీనిని చూపించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కోల్‌కతా: సహజీవనం చేసిన మహిళ బ్రేకప్ చెప్పడంతో ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె పెంపుడు కుక్కలను క్రూరంగా చంపాడు. ఆ మహిళకు వీడియో కాల్ చేసి దీనిని చూపించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. (man kills live-in partner’s dogs) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఈ సంఘటన జరిగింది. సంజీబ్ భట్టాచార్య, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పరి నోవా కలిసి సహజీవనం చేశారు. దక్షిణ కోల్‌కతాలోని విక్రమ్‌గఢ్ ప్రాంతంలో ఒక అద్దె ఇంట్లో వారిద్దరూ నివసించారు. అయితే సంజీబ్ వేధిస్తుండటంతో భరించలేని పరి నోవా అతడికి బ్రేకప్ చెప్పింది. ఆ ఇంటిని ఆమె వీడింది.
కాగా, నవంబర్ 14న పరి నోవాకు చెందిన రెండు పెంపుడు కుక్కలను సంజీబ్ భట్టాచార్య దారుణంగా చంపాడు. ఆమెకు అతడు వీడియో కాల్ చేశాడు. ఉరికి వేలాడిన ఒక పెంపుడు కుక్కను చూపించాడు. ఆందోళన చెందిన పరి నోవా వెంటనే స్థానిక వ్యక్తికి ఫోన్ చేసింది. ఆ ఫ్లాట్‌కు వెళ్లి చూడమని కోరింది. ఆ వ్యక్తి ఫ్లాట్‌కు చేరుకోగా రెండు పెంపుడు కుక్కలు చనిపోయి ఉన్నాయి. ఆ ఫ్లాట్ అంతటా రక్తపు మరకలు ఉన్నాయి. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంజీబ్ను అరెస్ట్ చేశారు.
మరోవైపు జంతు హక్కుల కార్యకర్తలు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు పెంపుడు కుక్కల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫ్లాట్‌లో ఇతర పెంపుడు జంతువులు కూడా ఉన్నట్లు గుర్తించారు. వాటిని కూడా చంపేందుకు నీటిని అతడు మరిగించినట్లు వారు ఆరోపించారు. పెంపుడు కుక్కలను క్రూరంగా చంపిన సంజీబ్ భట్టాచార్యపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అయితే సహజీవనం చేసిన సంజీబ్ వల్ల తాను శారీరక హింసకు గురైనట్లు పరి నోవా ఆరోపించింది. దీంతో ప్రాణ భయంతో తాను అపార్ట్‌మెంట్‌ను విడిచి వెళ్లినట్లు ఆమె తెలిపింది. ‘గత ఆరేడు నెలలుగా నన్ను దాదాపు ప్రతిరోజూ కొట్టేవాడు. ఇల్లు వదిలి వెళ్లడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అతడు నన్ను అన్ని విధాలుగా హింసించాడు. నన్ను చంపేసేవాడు కూడా’ అంటూ మీడియా ముందు ఆమె వాపోయింది.
అలాగే సంజీబ్ భట్టాచార్య తన సోదరుడిపై తప్పుడు కేసు నమోదు చేయించినట్లు పరి నోవా ఆరోపించింది. ‘కొన్ని నెలల కిందట అతడు విషం తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అప్పటి నుంచి నా సోదరుడిపై కేసు నడుస్తోంది. అతడు ఒక సైకో’ అని ఆమె విమర్శించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man kills live-in partner’s dogs | బ్రేకప్ చెప్పిందని.. సహజీవనం చేసిన మహిళ పెంపుడు కుక్కలను చంపిన వ్యక్తి
Reality | కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’పై హైప్ పెంచేస్తున్న సాంగ్స్
Cyclone | బలపడుతున్న వాయుగుండం..19 నుంచి ఏపీలో అతి భారీ వర్షాలు
418 movie | ప్రశాంత్ నీల్ హార్రర్ థ్రిల్లర్ ‘418’ను థియేటర్లలో మిస్సయ్యారా..?
Woman Hires Friends To Kill Boyfriend | ఫ్రెండ్స్ సహాయంతో ప్రియుడ్ని కిడ్నాప్ చేసి చంపేందుకు మహిళ యత్నం.. ఐదుగురు అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

