BITSAT రాసే విద్యార్థులు ఎంసెట్ తేదీని మార్చుకోవచ్చు..
టీఎస్ ఎంసెట్ | టీఎస్ ఎంసెట్, బిట్ శాట్ ( BITSAT ) ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో బిట్‌శాట్ రాసే విద్యార్థులు ఎంసెట్

హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్, బిట్ శాట్ ( BITSAT ) ప్రవేశ పరీక్షలు ఈ ఏడాది ఒకే సమయంలో నిర్వహించనున్నారు. దీంతో బిట్‌శాట్ రాసే విద్యార్థులు ఎంసెట్ పరీక్షల తేదీని మార్చుకునేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి అవకాశం కల్పించింది. ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు ఎంసెట్ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆగస్టు 3 నుంచి 9 వరకు బిట్‌శాట్ పరీక్షలు కూడా జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రెండు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎంసెట్ తేదీని మార్చుకోవచ్చు అని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి ఆగస్టు 5వ తేదీనే రెండు పరీక్షలు ఉన్నాయనుకుంటే.. ఎంసెట్ తేదీని ఆగస్టు 4వ తేదీ కన్నా లేదా 6వ తేదీ కన్నా మార్చుకోవచ్చు. ఇలాంటి విద్యార్థులు ఎంసెట్ కన్వీనర్‌కు తమ అభ్యర్థనను మెయిల్ చేయొచ్చు. దాని ఆధారంగా పరీక్ష తేదీల్లో మార్పు చేస్తారు. మెయిల్ convener.eamcet@tsche.ac.in.
ఈ ఏడాది ఇంజినీరింగ్ స్ర్టీమ్‌కు 1,63,644 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్, మెడికల్ స్ర్టీమ్‌కు 85,692 మంది దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. గతేడాది 2,21,706 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 2,49,336కు చేరింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins | మహిళలు రోజూ ఎంత మొత్తంలో ప్రోటీన్లను తీసుకోవాలి.. ఎలాంటి వ్యాయామాలు చేయాలి..?
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

