జీనోమ్ వ్యాలీలో ల్యాబ్‌స్పేస్

- 740 కోట్లతో కెనడా, సింగపూర్ కంపెనీల రాక
- ఇవాన్హో కేంబ్రిడ్జి, లైట్‌హౌస్ కాంటన్ సంయుక్త పెట్టుబడి
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని జీనోమ్‌వ్యాలీలో ల్యాబ్‌స్పేస్ అభివృద్ధికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చాయి. కెనడాకు చెందిన ఇవాన్ హో కేంబ్రిడ్జి, సింగపూర్‌కు చెందిన లైట్‌హౌస్ కాంటన్ సంస్థ జీనోమ్ వ్యాలీలో వంద మిలియన్ డాలర్లు (రూ.740 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించాయి. 80:20 దామాషా ప్రకారం ఈ సంస్థలు పెట్టుబడి పెడతాయి. దాదాపు పది లక్షల చదరపు అడుగుల మేర ల్యాబ్స్పేస్ను అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు. ఇవాన్ హో సంస్థ భారత విభాగం ఎండీ చాణక్య చక్రవర్తి, సీనియర్ ప్రతినిధులు శిల్పి చౌదరి, హరే కృష్ణ, సంకేత్ సిన్హా.. బుధవారం వర్చువల్ పద్ధతిలో పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు. జీనోమ్‌వ్యాలీలోని ఎంఎన్ పార్కులో తమ పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. లైఫ్‌సైన్సెస్ రంగంలో ఒక ప్రముఖ కెనెడియన్ సంస్థ దక్షిణాసియాలో ఇంత భారీ పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి అని వారు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, లైఫ్‌సైన్సెస్ రంగ మౌలిక వసతుల కల్పనలో ఈ పెట్టుబడి ఒక మైలురాయిగా అభివర్ణించారు. జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద లైఫ్‌సైన్సెస్ రంగ పరిశోధన, అభివృద్ధి క్లస్టర్ అని పేర్కొన్నారు. ఈ వ్యాలీలో ఇప్పటికే 200కు పైగా లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని తెలిపారు. తాజా పెట్టుబడి ఈ రంగానికి మరింత ఊతమిచ్చిందని ప్రశంసించారు. ఈ పెట్టుబడి ద్వారా జీనోమ్‌వ్యాలీలో లాబరేటరీ స్పేస్‌తోపాటు పరిశోధన, అభివృద్ధి, అనుబంధ మౌలిక వసతులు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. కంపెనీ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌తోపాటు భారతదేశం.. ప్రపంచ లైఫ్ సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటుందని చాణక్య చక్రవర్తి ధీమా వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

