హైదరాబాద్ : మంత్రి హరీశ్‌రావు అధ్యక్షతన బీఆర్కే భవన్లో మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయ్యింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌కు సంబంధించిన సమస్యలపై, అలాగే పోర్టల్ మాడ్యుల్స్ మార్పులపై, పొందుపరచాల్సిన ఆప్షన్లపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ భూరికార్డుల నిర్వహణలో ధరణి మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఏడాదిలో పదిలక్షలకుపైగా లావాదేవీలు జరిగాయన్నారు. భూరికార్డుల్లో జరిగిన పొరపాట్లను సరి చేయాలన్నారు. అనువైన విధంగా మాడ్యూల్స్ త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. మాడ్యూల్స్‌పై అవగాహన లేక సమస్యలు పరిష్కారం కావడం లేదని, ధరణి పోర్టల్, మాడ్యూల్స్, ఆప్షన్లపై శిక్షణ నిర్వహించాలని సూచించారు. జిల్లాస్థాయిలో అధికారులు, మీసేవ ఆపరేటర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. కలెక్టరేట్లలో ధరణి హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, టెక్నికల్ మాడ్యూల్స్ రూపొందించాలని ఆదేశించిన మంత్రివర్గం.. మరోసారి ఈ నెల 24న సమావేశం కావాలని నిర్ణయించింది.