హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21వ తేదీన జరుగనున్నది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం ప్రారంభం కానున్నది. ఈ సందర్భంగా రుణమాఫీ అమలుపై చర్చించి, మార్గదర్శకాలను ఆమోదించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.బడ్జెట్ రూపకల్పన, అసెంబ్లీ సమావేశాలు, బిల్లులపై చర్చించే అవకాశం ఉన్నదని సచివాలయ వర్గాలు తెలిపాయి.