CA Exams | హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : చార్టెడ్ అకౌంటెట్(సీఏ) ఇంటర్ పరీక్షలపై ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్(ఐసీఏఐ) కీలక నిర్ణయం తీసుకున్నది. 2025 నుంచి ఈ పరీక్షలను ఏడాదికి మూడుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇది వరకు సీఏ ఫౌండేషన్, ఫైనల్ పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించేవారు. ఏటా జూన్, డిసెంబర్లో పరీక్షలు జరిగేవి. సీఏ ఇంటర్ ఫౌండేషన్, ఫైనల్ పరీక్షలు ఇక నుంచి ఏటా జనవరి, మే, సెప్టెంబర్ మాసాల్లో జరుగుతాయి.