బడంగ్‌పేట, సెప్టెంబర్ 20: బుల్లెట్టు బండి సాంగ్‌తో ఫేమస్ అయిన పెండ్లి కొడుకు ఆకుల అశోక్‌కుమార్ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ (టీపీఎస్)గా పనిచేస్తున్న అతడు రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు మంగళవారం పట్టుకున్నారు. జిల్లెలగూడ చెందిన దేవేందర్‌రెడ్డి బడంగ్‌పేటలో సర్వే నంబర్ 2లో 300 గజాల స్థలంలో రెండు ఇండ్ల నిర్మాణ అనుమతికి మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకున్నాడు.
ఇం దుకు రూ.60 వేలు లంచం ఇవ్వాలని, లేనిపక్షంలో పర్మిషన్ ఇవ్వబోనని టీపీఎస్ అశోక్‌కుమార్ తేల్చిచెప్పాడు. దేవేందర్‌రెడ్డి రూ.50 వేలు ఇస్తానని అశోక్‌తో ఒప్పం దం చేసుకున్నాడు. తొలిదఫాలో రూ.20 వే లు ఇచ్చాడు. దేవేందర్‌రెడ్డి నుంచి మంగళవారం ప్రైవేటు ఆర్కిటెక్చర్ శ్రీనివాస్‌రాజ్ ద్వారా రూ.30 వేలు లం చం తీసుకొని అశోక్‌కుమార్ తన టేబుల్లాకర్లో పెడుతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వారిద్దరిని అరెస్టు చేశారు. నాగోల్‌లోని రాక్‌టౌన్‌లో ఉన్న అశోక్‌కుమార్ ఇంట్లో సోదాలు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. శ్రీనివాస్‌రాజ్ ద్వారానే అశోక్ అవినీతికి పాల్పడేవాడు. గతంలో కొందరు ఇంటి యజమానులతో అశోక్ గొడవ పడిన ఘటనలూ ఉన్నాయి.