Dairy Farm | నర్సాపూర్ : డెయిరీ ఫామ్‌కు సంబంధించిన షెడ్డు తగలబడి రెండు బర్రెలు, 5 దుడ్డెలు మృత్యువాత చెందిన సంఘటన మెదక్ జిల్లా శివంపేట్ మండలం బొజ్జ తాండలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బోజ్యా తాండాకు చెందిన బానోతు లక్ష్మణ్ అనే రైతు ఊరి బయట డెయిరీ ఫామ్ షెడ్డు వేసుకొని ఉపాధి పొందుతున్నాడు. బుధవారం రాత్రి సమయంలో ప్రమాదవశాత్తు షెడ్డుకు మంటలు అంటుకొని రెండు బర్రెలు, ఐదు దుడ్డెలు మంటలకు కాలి మృతి చెందాయి. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయని, లేదా పక్కనే గడ్డివాముకు మంటలు అంటుకొని అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే మూడు లక్షల పదివేలు పెట్టి రెండు బర్రెలను కొనడం జరిగిందని బాధితులు వాపోయాడు. వీటి విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని, ప్రభుత్వం, అధికారులు ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు లక్ష్మణ్ కోరాడు.