జఫర్‌గఢ్‌లో బౌద్ధ స్తూపం
జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయం ఆధారాలున్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయని ఆయన పేర్కొన్నారు.
- జైన దేవాలయ నిర్మాణాలు కూడా..
- పాలరాతితో శిల్పాలు చెక్కిన ఆధారాలు
- చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి వెల్లడి
జఫర్‌గఢ్, డిసెంబర్ 29: జనగామ జిల్లా జఫర్‌గఢ్‌లో కొత్త రాతి యుగం నాటి గుర్తులు, బౌద్ధ స్తూపం, జైన దేవాలయం ఆధారాలున్నాయని చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయని ఆయన పేర్కొన్నారు. జఫర్‌గఢ్‌కు పడమటి వైపు ఉన్న మాల్చగుట్టకు మూడు వైపులా గ్రామ పెద్ద చెరువు ఉన్నది. గుట్ట దిగువన చెరువు వైపు ఎత్తయిన ఇటుక నిర్మాణం ఉన్నది. ఇటుక ముక్కలతో ప్రాంతమంతా ఎత్తయిన దిబ్బలా ఉన్నది.
బౌద్ధ శిల్పాలకు ఉపయోగించే పాలరాతికి చెందిన అనేక చిన్న పెచ్చులు లభించాయని, పాలరాయిని దిగుమతి చేసుకొని స్థానిక గుట్టపైనే శిల్పాలు చెక్కినట్టు తెలుస్తున్నదని రెడ్డి రత్నాకర్‌రెడ్డి తెలిపారు. జఫర్‌గఢ్‌లోని మాల్చ గుట్ట బౌద్ధ స్తూపం జగిత్యాల జిల్లాలోని మునుల గుట్టకు రెండో వైపు ఉన్న శిథిల బౌద్ధ స్తూప పరిసరాలను తలపిస్తున్నట్టు తెలిపారు. గుట్ట దిగువన సప్త మాతృకలలో భాగంగా కనిపించే వారాహి శిల్పం విడిగా ఉండటం విశేషమని, శిల్పం పొట్ట నుంచి దిగువ భాగం వరకే ఉన్నదని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- buddhist
- Jain temple
- Zafargarh
RELATED ARTICLES
తాజా వార్తలు
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

