BSC Nursing | నీట్ లేకున్నా బీఎస్సీ నర్సింగ్ మేనేజ్మెంట్ కోటా సీట్లు భర్తీ
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్ (ఎంసెట్) హాజరైనా లేదా మెరిట్ ఆధారంగా అయినా సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
BSC Nursing | హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): బీఎస్సీ నర్సింగ్ కోర్సులో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నీట్ హాజరు తప్పనిసరి నిబంధన నుంచి సడలింపు ఇచ్చింది. ఈఏపీ సెట్ (ఎంసెట్) హాజరైనా లేదా మెరిట్ ఆధారంగా అయినా సీట్లు భర్తీ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ సడలింపు 2023-24 విద్యాసంవత్సరానికి మాత్రమే వర్తించనున్నట్టు ఆమె ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అవసరమైతే మేనేజ్మెంట్ కోటాతో పాటు కన్వీనర్ కోటాకు కూడా ఇదే నిబంధనను వర్తింపజేయవచ్చని చెప్పారు. మెరిట్ లేదా ఈపీసెట్ లేదా నీట్ ఈ మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇవ్వాలో హెల్త్ యూనివర్సిటీదే తుది నిర్ణయమని పేర్కొన్నారు.
బీఎస్సీ నర్సింగ్ చదవాలంటే కచ్చితంగా నీట్ రాయాల్సిందేనన్న నిబంధనతో అటు విద్యార్థులు, ఇటు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నష్టపోతున్నాయి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ సూచనల మేరకు కన్వీనర్ కోటాకు ఎంసెట్‌ను ప్రామాణికంగా వర్తింపజేయగా, మేనేజ్మెంట్ కోటాకు మాత్రం ఇంకా నీట్ తప్పనిసరి అనే నిబంధన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్, కన్వీనర్ కోటా సీట్లు భర్తీ కావడం లేదు. దాదాపు రెండువేలకుపైగా సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ అంశంపై విద్యార్థులు, వారితల్లిదండ్రులు, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల యాజమాన్యం నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. నీట్‌తోపాటు ఎంసెట్ ర్యాంకు, మెరిట్ ఆధారంగా అడ్మిషన్లు జరిపేలా అవకాశం కల్పించాలని కోరారు. వీటిని పరిశీలించిన అనంతరం సడలింపు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

