Peddapalli | అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి.. మహిళను హత్య చేసిన దుండగులు
Peddapalli | పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది.
హైదరాబాద్ : పెద్దపల్లి జిల్లాలో(Peddapally) దారుణం చోటు చేసుకుంది. అప్పు తిరిగి ఇస్తానని ఇంటికి పిలిచి ఓ మహిళను దుండగులు హత్య చేశారు(Brutal murder). వివరాల్లోకి వెళ్తే..ముత్తారం మండల కేంద్రానికి చెందిన పెరుక రాజేశ్వరి(60) ఈ నెల 5 నుంచి కనిపించకుండా పోయింది. ఇంట్లో ఒంటరిగా ఉంటుండటంతో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. 8న పారుపల్లి శివారులోని వ్యవసాయ బావిలో గోనె సంచిలో కట్టి పడేసిన గుర్తు తెలియని మహిళ శవాన్ని రైతు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అయితే ఈ నెల 14న రాజేశ్వరి కనిపించడం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వారు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం మృతురాలిని రాజేశ్వరిగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తులో హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. రాజేశ్వరి ఇంటి సమీపంలో ఉండే లావణ్య కొంతకాలం కిందట ఆమె వద్ద విడతల వారీగా రూ.1.50 లక్షల అప్పు తీసుకొంది. కొంతకాలంగా తిరిగివ్వాలని రాజేశ్వరి ఒత్తిడి చేసింది. దీంతో ఈ నెల 8న డబ్బులు ఇస్తామని ఆమెను లావణ్య ఇంటికి పిలిచింది. అనంతరం భర్త రవి మరో వ్యక్తి కలిసి రాజేశ్వరి గొంతు నులిమి హత్య చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

