Tunga Balu | ఉస్మానియా యూనివర్సిటీ : తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుడు, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగబాలు జన్మదిన వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు కేక్ కట్ చేసి, మొక్కలు నాటి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తుంగ బాలు ముందుండి పోరాడారని గుర్తు చేశారు. ఆయన భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిష్టించాలని ఆకాంక్షించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.