హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై శాపనార్థాలు పెడుతూ తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ పునరుజ్జీవనం పేరిట చేపట్టిన యాత్రలో సీఎం రేవంత్, మంత్రి వెంకట్‌రెడ్డి మాటలు అర్థరహితమని కొట్టిపారేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ… పదేండ్ల పాలనలో నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని, అలాంటి వ్యక్తిపై ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి కోమటిరెడ్డి గ్యాంగ్స్టర్లలా మాట్లాడుతున్నారని విమర్శించారు.