హైదరాబాద్ జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ ప్రాతినిథ్యం వహిస్తున్న విద్యాశాఖపై ఎందుకు చర్చించలేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రశ్నించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డికి రియల్ ఎస్టేట్‌పై ఉన్న శ్రద్ధ విద్యారంగంపై లేదని, అందుకే మంత్రివర్గ సమావేశంలో ఒక్క నిమిషం కూడా చర్చించలేదని దెప్పిపొడిచారు.
విద్యాసంవత్సరం మొదలై రెండు వారాలైన కనీసం ఒక్కసారి కూడా సమీక్షించకపోవడం విడ్డూరమన్నారు. నేటి నుంచి 30 వరకు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బడిబాట పేరిట అన్ని మండలకేంద్రాల్లో ఆందోళనలు చేపడతామని వెల్లడించారు.