BRS Working President | తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలు కోటి ఆకాంక్షలతో మొదలైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ సకల విజయాలు కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
ఉగాది అంటే షడ్రుచుల వేడుక
ఉగాది అంటే కష్టసుఖాల కలయిక
ఉగాది అంటే పంచాంగ శ్రవణాలు
ఉగాది అంటే తరాలు మారినా.. తరగని సంప్రదాయాలు
ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే..
ఆటుపోట్లను సమానంగా స్వీకరించాలనే
తాత్వికతను బోధించే గొప్ప పండుగ.. మన ఉగాది
కొత్త ఆశలు.. కోటి ఆకాంక్షలతో..
మొదలైన శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో
సకల విజయాలు కలగాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలకు, బీఆర్ఎస్ శ్రేణులందరికీ..
హృదయపూర్వకంగా ఉగాది పండుగ శుభాకాంక్షలు
జై తెలంగాణ అంటూ కేటీఆర్ రాసుకోచ్చారు.