హైదరాబాద్ : మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. తంగళ్లపల్లి మండలంలోని అంకుసాపూర్ మాజీ ఎంపీటీసీ కుంటయ్య మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కాగా, తన భూమిని కాంగ్రెస్ నాయకుడు కబ్జా చేశాడని ఆరోపిస్తూ కుంటయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. కాంగ్రెస్ నాయకుడు రూ.10 లక్షల విలువైన నా భూమి కబ్జా చేసిండు.. సీఐ, ఎస్సైకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఉల్టా నా మీద నే కేసు పెట్టిన్రు. ఇప్పుడు నాకు ప్లాటు లేదు.. నా బిడ్డ పెండ్లికి ఏమీ మిగల్లేదు.
నా చావుకు కాంగ్రెస్ నాయకులే కారణం. నా కుటుంబాన్ని ఆదుకో కేటీఆర్ అన్నా’ అం టూ లేఖ రాసి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మం డలం అంకుసాపూర్కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ కర్కబోయిన కుంటయ్య సోమవారం గడ్డిమందు తాగగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. కుంటయ్యకు భార్య విజయ, కూతుళ్లు భార్గవి (22), దీక్షిత(11) ఉన్నారు.