KTR | హైదరాబాద్ : సిరిసిల్ల జిల్లాలోని గీతానగర్‌లోని హైస్కూల్ విద్యార్థి ఒకరు.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఊహించన సర్ప్రైజ్ ఇచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా సదరు విద్యార్థి.. కేటీఆర్ కేసీఆర్‌ను ఆలింగనం చేసుకున్న చిత్రాన్ని తన పెన్సిల్ ఉపయోగించి చిత్రీకరించి బహుమతిగా ఇచ్చాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు.
గీతా నగర్ హైస్కూల్ విద్యార్థి ఆదిత్య చంద్ర తన పుట్టిన రోజు సందర్భంగా ఈ హృదయపూర్వక పెన్సిల్ స్కెచ్ తనకు పంపాడు. అది నిజంగా తనను ఆశ్చర్యానికి గురి చేసింది. థ్యాంక్స్ అండ్ మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని ఆదిత్యకు కేటీఆర్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ తన స్పందన తెలియజేయడంతో పాటు ఆ పెన్సిల్ స్కెచ్‌ను జోడించారు.
Aditya Chandra a 10th class student from Geeta Nagar High School, Siricilla has sent me this heartwarming pencil sketch on the occasion of his birthday!!
That came as a real surprise!
Many thanks and I wish you a wonderful birthday Aditya Chandra 🎂 pic.twitter.com/D0jMslba4W
— KTR (@KTRBRS) September 12, 2025