KTR : కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్ ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ.45 కోట్లు బదిలీ చేశారని, అవి ఎవరి ఖాతాలని ఎక్స్‌లో ఆయన ప్రశ్నించారు. తీగ లాగితే తెలంగాణ కాంగ్రెస్ డొంక మొత్తం కదులుతుందని విమర్శలు చేశారు.
మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఆ డబ్బులనే ఖర్చు చేసినట్లు అనిపిస్తోందని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. ‘వీ6 బిజినెస్ యజమాని ఎవరు, ఆ ఖాతాకు రూ.4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు..? లోక్‌సభ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో నగదు విత్‌డ్రా చేసిన బార్లు, బంగారం దుకాణాలు ఎవరివి..? కాంగ్రెస్ పార్టీతో వారికి సంబంధం ఏమిటి..? కుంభకోణంతో హైదరాబాద్‌కు ఇన్ని లింకులు కనపడుతున్నా తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఎవరు కాపాడుతున్నారు..?’ అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
సిద్ధరామయ్యను తొలగిస్తే పక్కన ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ జార్ఖిహొలీ అంటున్నారని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీతో పెనవేసుకున్న బంధం వాల్మీకి స్కామేనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఈ స్కాంపై నోరు విప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
✳️ కర్ణాటకలో జరిగిన భారీ వాల్మీకి కుంభకోణంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు లింక్!
✳️ హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాదారులకు వాల్మీకి కార్పొరేషన్ డబ్బు రూ. 45 కోట్లు బదిలీ చేశారు. అవి ఎవరి అకౌంట్లు?
✳️ “V6 బిజినెస్” యజమాని ఎవరు, ఈ ఖాతాకు రూ. 4.5 కోట్లు ఎందుకు బదిలీ చేశారు?
✳️… pic.twitter.com/0X1DiQIh4b
— KTR (@KTRBRS) August 25, 2024