KTR | హైదరాబాద్ : ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా రాష్ట్ర అధికారిక చిహ్నంలో కాకతీయ కళాతోరణం ఉండదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది అని కేటీఆర్ విమర్శించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తెహజీబ్‌కి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడనట అని కేటీఆర్ మండిపడ్డారు.
కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి. “కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా..? అని కేటీఆర్ నిలదీశారు.
పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన
ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ గారు తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనట
కానీ రాష్ట్ర గీతంలో మాత్రం అదే… pic.twitter.com/kWaTa92aIF
— KTR (@KTRBRS) May 28, 2024