KTR | కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి : కేటీఆర్
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
KTR | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. కంచ గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా అంటూ హెచ్చరించింది. రేవంత్ రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. వీటన్నింటికీ తాను బాధ్యుడిని కాదని రేవంత్ రెడ్డి తప్పించుకునే అవకాశం లేదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై, కంచె గచ్చిబౌలి వ్యవహారంలో చేసిన తప్పులను ఒప్పుకోవాలి. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన కంచె గచ్చిబౌలి అడవులను తిరిగి పునరుద్ధరించాలి. లేకుంటే రేవంత్ రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవు. కంచె గచ్చిబౌలి భూములను అమ్మి పది వేల కోట్ల రూపాయల స్కాం చేయడం ముమ్మాటికి అవినీతి, నమ్మక ద్రోహమే. సెలవు దినాల్లో బుల్డోజర్లను పంపి అడవులను ధ్వంసం చేయడం ముమ్మాటికి పర్యావరణ చట్టాల ఉల్లంఘనే. రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగింది. కంచె గచ్చిబౌలి భూములను ప్రభుత్వం కాపాడాల్సిందే. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన పది వేల కోట్ల స్కాంకు బాధ్యత వహించాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

