KTR | అస్తవ్యస్థంగా మారిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవస్థ వల్లే.. విద్యార్థులకు ఈ అవస్థ…! ఈ అస్వస్థత…!! : కేటీఆర్
KTR | రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్దమార్పే తెచ్చారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం హాస్టళ్లలో నెలకొన్న దుస్థితిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అన్నారు.. మొత్తానికి కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్దమార్పే తెచ్చారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం హాస్టళ్లలో నెలకొన్న దుస్థితిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పదేండ్ల క్రితం నాటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో పురుగుల అన్నం, నీళ్ల చారు కనిపించేవి. నేటి కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందన్నారు. అల్పాహారంలో బల్లులు, చట్నీల్లో చిట్టెలుకలు దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు.
మొన్న భువనగిరి సాంఘిక సంక్షేమ పాఠశాలలో కలుషిత ఆహారం తిన్న విద్యార్థి జీవితం విషాదాంతంగా మారింది. నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాలో బల్లి పడడంతో 20 మంది విద్యార్థులు వాంతులతో ఆస్పత్రుల్లో చేరారు. సుల్తాన్పూర్ జేఎన్టీయూ హాస్టల్లో చట్నీలో చిట్టెలుక దర్శనంతో విద్యార్థులు బెంబేలెత్తారు. ఈ విషాహారం తింటే.. విద్యార్థుల ప్రాణాలకు గ్యారెంటీ ఎవరు…? అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు భరోసా ఎక్కడ..? అని కేటీఆర్ నిలదీశారు.
కలుషిత ఆహారం వల్ల.. పిల్లలు ఆడుకోవాల్సిన వయసులో ఆస్పత్రుల పాలవుతున్నారు. అస్తవ్యస్థంగా మారిన ప్రభుత్వ వ్యవస్థ వల్లే.. విద్యార్థులకు ఈ అవస్థ…! ఈ అస్వస్థత…!! ఇకనైనా కాంగ్రెస్ సర్కారు కళ్లు తెరవాలి.. లేకపోతే.. భావిభారత పౌరుల నిండు ప్రాణాలకే ప్రమాదం. వైఫల్యాలను సరిచేయకపోతే ఊహించని విషాదం ఏర్పడే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
“మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి” అన్నారు..
మొత్తానికి.. కాంగ్రెసోళ్లు వచ్చారు.. పెద్ద మార్పే తెచ్చారు.ఆనాటి కాంగ్రెస్ పాలనలో..
ప్రభుత్వ హాస్టళ్లలో దుస్థితి..
పురుగుల అన్నం.. నీళ్ల చారు..ఈనాటి కాంగ్రెస్ పాలనలో..
ప్రభుత్వ హాస్టళ్లలో ఇంకా అధ్వాన్న పరిస్థితి..
బల్లిపడిన… pic.twitter.com/9OjLhJvBgm— KTR (@KTRBRS) July 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

