KCR | హైదరాబాద్ : కేసీఆర్ తెలంగాణ జాతి పిత పాటను మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌తో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారాహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విడుదల చేశారు. ఈ పాటను మానుకోట ప్రసాద్ రచించగా, గానం సాకేత్ అందించారు. ఈ పాటకు స్వరాలు మిథున్ కూర్చారు. డీవోపిగా అజయ్ కొడం కొనసాగగా.. దీనికి సహకారం మద్దెల సందీప్ అందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దయాకర్‌రెడ్డి, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, పల్లా ప్రవీణ్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పడాల సతీష్, కల్లెట్లపల్లి శోభన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.