KTR | హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు జయశంకర్ సార్. తెలంగాణ భావజాల వ్యాప్తికి సార్ చేసిన కృషి అసామాన్యం. అంకెలు, లెక్కలతో సహా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సహేతుకంగా వివరిస్తూ.. ప్రజలను చైతన్యపరిచిన మహా మనిషి జయశంకర్ గారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఉద్యమ నాయకుడు కేసీఆర్కు ఒక గురువులా ఉంటూ.. మలిదశ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన సార్ భౌతికంగా మన మధ్య లేకపోవడం తెలంగాణకు తీరని లోటు. తెలంగాణ పోరాటంలో వారి సేవలను గుర్తిస్తూ.. జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు, వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుంది అని కేటీఆర్ గుర్తు చేశారు. సదా సార్ యాదిలో.. జోహార్ జయశంకర్ సార్! అని కేటీఆర్ నినదించారు.