KTR | నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారు..! రేవంత్ తీరుపై కేటీఆర్ ధ్వజం
KTR | మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
KTR | హైదరాబాద్ : మత్స్యకారుల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత మత్స్యకారుల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తున్నదన్నారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదు.. టెండర్ల దశ దాటనే లేదు.. అసలు ఆ పథకం ఉంటుందో లేదో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ అన్నారు.
చేపల వేటనే నమ్ముకున్న బహుజన కులాల బతుకు దెరువును దెబ్బకొట్టడం న్యాయమా..? అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం.. వృత్తికి ఊపిరిపోసి మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపింది.. ఇన్ లాండ్ ఫిష్ ఉత్పత్తిలో తెలంగాణ అద్భుతాలు చేసింది..! కేసీఆర్ ఆనవాళ్లను తుడిచెయ్యాలనే రాజకీయ కక్షతో..మత్స్యకారుల జీవనోపాధిని కాలరాస్తారా..? అని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
వృత్తి కులాలపై కత్తి కట్టినట్టు వ్యవహరిస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం..!
మత్తడి దుంకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని నీరుగార్చేస్తున్నారు..!
చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం చేస్తున్నట్టు… pic.twitter.com/aZI5oUoAhN
— KTR (@KTRBRS) September 25, 2024
ఇవి కూడా చదవండి..
Telangana | ఊరూరా లిక్కర్ మాల్స్? రాష్ట్రంలో పెరగనున్న మద్యం షాపులు
Crop Loans | దర్వాజలు ఊడబీకి దౌర్జన్యం.. అప్పు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డీసీసీబీ
DSC Results | డీఎస్సీ ఫలితాలపై సస్పెన్స్.. ఫైనల్ కీ అభ్యంతరాలపై తేల్చని విద్యాశాఖ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

