Telangana | ఊరూరా లిక్కర్ మాల్స్? రాష్ట్రంలో పెరగనున్న మద్యం షాపులు
Telangana | మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్‌కు లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి.
- ఆదాయం పెంపునకు సర్కార్ యోచన
- 14 వేల మందికి ఒకటి ఉండేలా ప్లాన్?
- ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం
- ఒకటీ రెండు రోజుల్లో ఎక్సైజ్ నివేదిక
Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడంతోపాటు అధికార పార్టీ నాయకులను సంతృప్తి పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఎత్తులు వేస్తున్నది. అడిగిందే తడవుగా లేదనకుండా ఏ4 ఎలైట్ మద్యం మాల్స్‌కు లైసెన్స్‌లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమాలోచనలు పూర్తి అయ్యాయి. ఇందుకోసం ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అనే అంశాన్ని అధికారులు తెరమీదకి తెచ్చారు. ఈ నిష్పత్తిని అమల్లోకి తెస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పదివేలకుపైగా మద్యం దుకాణాలు తెరచుకోనున్నాయి. గత ప్రభుత్వం 2023 ఆగస్టులోనే ఏ4 మద్యంషాపులకు లైసెన్స్‌ల జారీ కోసం నోటిఫికేషన్ ఇచ్చి టెండర్లు కూడా ఖరారు చేసింది. గత సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీ నుంచి ఏ4 లైసెన్స్‌లు అమల్లోకి వచ్చాయి. ఇదే నెలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్త మద్యం దుకాణాలు తెరవకుండా ఆపడానికి కొత్త ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ, పాలసీ నిబంధనలు అంగీకరించలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికే పాలసీ అమల్లోకి వచ్చింది కాబట్టి, నిబంధనల ప్రకారం 2025 నవంబర్ 31 వరకు పాత పాలసీ అమలులో ఉంటుంది. అప్పటివరకు కొత్తం మద్యం దుకాణాల ఏర్పాటుకు అవకాశం లేదు. దీంతో అధికారం చేతులో ఉండి కూడా మద్యం వ్యాపారం చేసుకోలేకపోతున్నామనే అంతర్మధనం అధికార పార్టీ నాయకుల్లో రోజురోజుకు పెరిగిపోతూ వచ్చింది. ఇదే అంశాన్ని ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై కసరత్తు చేయాలని ‘ముఖ్య’ నాయకుడు ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. నిబంధనలు తిరిగేసిన అధికారులు ఇప్పుడున్న ఎక్సైజ్ చట్టాలప్రకారం ఒక్క దుకాణం కానీ, ఒక్క బార్ కానీ అదనంగా ఇవ్వడానికి అవకాశం లేదని తేల్చి చెప్పినప్పటికీ, తమకు దుకాణాలు ఇవ్వాల్సిందేనని అధికార పార్టీ నేతలు పట్టుబడుతున్నట్టు తెలిసింది.
న్యాయపరమైన చిక్కులు లేకుండా..
ఈ నేపథ్యంలో అధికారులు ఎక్సైజ్ నిబంధనల్లో ఉన్న జాతీయ నిష్పత్తి అంశాన్ని తెరమీదకు తెచ్చారు. దీని ప్రకారం ప్రతి 14 వేల మంది జనాభాకు ఒక మద్యం దుకాణాలు ఏర్పాటు చేయొచ్చని ఎక్సైజ్ అధికారులు నిర్ధారించారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ పాలసీని రూపొందించాల్సిన అవసరం కానీ, క్యాబినెట్ సబ్ కమిటీ ఆమోదం కానీ అవసరం లేకుండా నేరుగా మద్యం దుకాణాలను అనుమతించవచ్చు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. ఈ లెక్కల ప్రకారం 13,300 మద్యం దుకాణాల ఏర్పాటుకు అర్హత ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఇవి పోనూ కొత్తగా 10,680 మద్యం దుకాణాలు ఏర్పా టు చేయడానికి అవకాశం ఉన్నట్టు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రహస్య నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం న్యాయ సలహా కోసం పంపగా వారు కొన్ని సూచనలు చేసినట్టు తెలిసింది.
ఎక్సైజ్ లక్ష్యం 45 వేల కోట్లు
మరోవైపు, గతంలో ఎక్సైజ్‌శాఖ ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం నిధులు ఎలా పెంచాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించింది. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన నిధులు కూడా మద్యం నుంచే రాబట్టాలని ఎక్సైజ్ అధికారులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,620 ఏ4 మద్యం దుకాణాలు, 1,200 బార్లు, క్లబ్బులు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం క్రయ విక్రయాలు, అన్ని రకాల సుంకాలు కలుపుకొని రాష్ట్ర ఖజనాకు 2022లో రూ.32 వేల కోట్లు, 2023లో రూ.35 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని అదనంగా రూ.10 వేల కోట్లకు పెంచి.. రూ.45 వేల కోట్లు రాబట్టాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
Bihar Man Arrested | అసెంబ్లీని బాంబుతో పేల్చేసినట్లు ఏఐ వీడియో.. బీహార్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

