KTR | తన గత ఐదు పుట్టిన రోజులు వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దానికి #GiftASmile కార్యక్రమమే కారణమని పేర్కొన్నారు. పుట్టిన రోజు నాడు పుష్పగుచ్ఛాల్ని వ్యతిరేకించాలన్న చిన్న ఆలోచనతో మొదలై.. ఇప్పుడు ప్రతి ఏడాది ఎదురుచూసే ఒక పవిత్రమైన కార్యక్రమంగా గిఫ్ట్ ఏ స్మైల్ మారిందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రయాణంలో భాగమై తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు.
2020: కొవిడ్ కష్టకాలంలో ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని అన్నారు. అందుకే #GiftASmile కార్యక్రమం కింద తన మద్దతుదారుల సహకారంతో రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రులకు 108 ఆంబులెన్స్‌లను అందజేశామని గుర్తు చేశారు.
2021లో దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు 1400కిపైగా కస్టమ్ మేడ్ ట్రైవీలర్స్ను అందజేశామన్నారు.
2022లో ఎడ్యుకేషన్ మీద దృష్టిసారించామని తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో 6 వేల సామ్సంగ్ ట్యాబ్‌లను విద్యార్థులకు అందజేశామని పేర్కొన్నారు. దీనివల్ల నీట్/జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. ఇది తన జీవితంలో గుర్తుంచుకోదగిన సందర్భమని చెప్పారు.
2023లో కూడా ఎడ్యుకేషన్‌పైనే మరింత దృష్టిసారించామని తెలిపారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో ఉంటున్న 116 మందికిపైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు i5 డెల్ ల్యాప్‌టాప్‌లు అందించామని, కోచింగ్ విషయంలో పూర్తి మద్దతు అందించామని పేర్కొన్నారు.
2024లో సిరిసిల్ల జిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు పెరగడం తనను కలిచివేసిందని తెలిపారు. అందుకే ఆ నేతన్నల కుటుంబాలకు సాయం అందించేందుకు గత సంవత్సరం పూర్తిగా అంకితమిచ్చానని చెప్పారు
ఈ ఏడాది జీవితం, ఆశ మీద దృష్టి పెట్టాలని అనుకుంటున్నట్లుగా కేటీఆర్ వెల్లడించారు. గడిచిన 18 నెలల్లో సిరిసిల్ల జిల్లాలో 4910 కాన్పులు జరిగాయని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఎంతో మార్పును తీసుకొచ్చింది.. అయితే వాటన్నింటిలో తనకు కేసీఆర్ కిట్ ఎంతో ఇష్టమైనదని చెప్పారు. జీవితానికంటే గొప్ప మార్పు మారేదైనా ఉంటుందా అని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే ఆ 4910 మంది తల్లులు, శిశువులకు కేసీఆర్ కిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు
పుట్టిన రోజు నాడు పుష్పగుచ్ఛాల్ని వ్యతిరేకించాలన్న చిన్న లోచనతో మొదలై.. ఇప్పుడు ప్రతి ఏడాది ఎదురుచూసే ఒక పవిత్రమైన కార్యక్రమంగా గిఫ్ట్ ఏ స్మైల్ మారిందని కేటీఆర్ అన్నారు. ఈ ప్రయాణంలో భాగమై తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ణతలు తెలిపారు.