KTR | హైదరాబాద్ : జమ్మూకశ్మీర్లోని కిష్టావర్ జిల్లాలో వరదలు సంభవించి 46 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిష్టావర్ జిల్లాలో వినాశకరమైన తుపాను సంభవించి 46 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. 100 మందికి పైగా గాయపడడం, ఇంకా చాలా మంది ఆచూకీ తెలియడం లేదన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తప్పిపోయిన వారి ఆచూకీ త్వరగా కనుగొంటారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.