పోలీసుల అదుపులో బీఆర్ఎస్ కార్యకర్త
ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఆరోపిస్తూ గురువారం కోదాడకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదల ఉపేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకేమీ తెలియదని.. సోషల్ మీడియాలో వస్తే ఆ పోస్టులను ఫార్వర్డ్ చేశాను అని ఉపేందర్ చెప్పినప్పటికీ వినకుండా పోలీసులు పదే పదే ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని కేసు
కోదాడ, ఆగస్టు 27 : ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఆరోపిస్తూ గురువారం కోదాడకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మాదల ఉపేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకేమీ తెలియదని.. సోషల్ మీడియాలో వస్తే ఆ పోస్టులను ఫార్వర్డ్ చేశాను అని ఉపేందర్ చెప్పినప్పటికీ వినకుండా పోలీసులు పదే పదే ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. లష్కర్ ఉద్యోగాల్లో ముడుపులు తీసుకున్నది ఎవరు..
అమ్మగారి హుండీ అని పొందవపర్చిన పోస్టులో ఆ అమ్మ ఎవరో చెప్పాలని, బర్ల దొంగతనంలో ముడుపులు తీసుకున్నది ఎవరో చెప్పాలని ఉపేందర్‌పై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది. అతడిపై ఎఫ్ఐఆర్ చేశారా లేదా అనేది తెలియాల్సి ఉంది.. నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని ఈ రాత్రికి ఇంటికి పంపాలని, తెల్లారి వచ్చి సమాధానం ఇస్తాడని స్థానిక న్యాయవాదులు పాలేటి నాగేశ్వరరావు, ఎడ్లవల్లి వెంకటేశ్వరరావు పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఉపేందర్‌ను వేధిస్తే సహించమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

