బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దాడి!
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల్ల పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన విజయదుర్గ శోభాయాత్రలో బీఆర్ఎస్ కార్యకర్త తమ్మిశెట్టి నరేశ్‌పై కాంగ్రెస్ నాయకులు దాడిచేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడుచర్లలోని రాజీవ్‌నగర్ వార్డులో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యనాయకుడి భార్య పోటీ చేసిన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు అనుకూలంగా నరేశ్ పనిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు విజయదుర్గ శోభాయాత్రలో నరేశ్‌తో పాటు అతడి మిత్రుడిపై దాడిచేశారు.
- నేరేడుచర్ల విజయదుర్గ ఆలయ శోభాయాత్రలో ఘటన
నేరేడుచర్ల్ల, అక్టోబర్ 22 : సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల్ల పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన విజయదుర్గ శోభాయాత్రలో బీఆర్ఎస్ కార్యకర్త తమ్మిశెట్టి నరేశ్‌పై కాంగ్రెస్ నాయకులు దాడిచేశారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నేరెడుచర్లలోని రాజీవ్‌నగర్ వార్డులో మున్సిపల్ ఎన్నికల్లో ముఖ్యనాయకుడి భార్య పోటీ చేసిన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా బీఆర్ఎస్కు అనుకూలంగా నరేశ్ పనిచేశాడు. దీంతో కక్ష పెంచుకున్న కాంగ్రెస్ నాయకులు విజయదుర్గ శోభాయాత్రలో నరేశ్‌తో పాటు అతడి మిత్రుడిపై దాడిచేశారు.
శోభాయాత్రలో విధులు నిర్వహిస్తున్న సీఐ చరమందరాజు, నేరెడుచర్ల పట్టణ ఎస్సై గోపాల్‌రెడ్డి సైతం దాడిచేసిన వారిని అడ్డుకోకుండా బాధితుడినే అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ఉంచారు. గురువారం ఉదయం నరేశ్ కుటుంబసభ్యులు, వడ్డెర కులస్తులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో నేరెడుచర్ల ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై వచ్చి ధర్నా చేస్తున్న వారితో మాట్లాడి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

