దోమలపెంట, డిసెంబర్ 16 : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండ లం దోమలపెంట బీఆర్ఎస్ మాజీ ఉ ప సర్పంచ్ కటకం మహేశ్, కటకం నా గలక్ష్మికి చెందిన దుకాణాలను పొరపాటున కూల్చి వేశామని, వాటిని తిరిగి నిర్మించి ఇస్తామని దోమలపెంట, మ న్ననూరు పంచాయతీ కార్యదర్శులు హామీపత్రం జారీ చేశారు. ‘ఈ నెల 11న కటకం మహేశ్, కటకం నాగల క్ష్మి దుకాణాలను మా పొరపాటు కారణంగా తొలగించాం. వాటిని తమ సొంత ఖర్చులతో రెండు వారాల్లోగా పునర్నిర్మించి ఇస్తాం. కోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటాం అని హామీ ఇ స్తూ సంతకం చేస్తున్నాం’ అంటూ దో మలపెంట, మన్ననూరు పంచాయతీ కార్యదర్శులు జయంత్, భీముడు లిఖిత పూర్వకంగా రాసిచ్చారు.
న్యాయమే గెలిచింది..
కేసు నడుస్తుండగా న్యాయస్థానాన్ని ధిక్కరించి నిర్మాణాలు తొలగించడంతో కోర్టు తప్పుపట్టిందని బాధితుడు, మా జీ ఉప సర్పంచ్ కటకం మహేశ్ తెలిపారు. రాజకీయ కక్షతో కావాలని నిర్మాణాలను కూల్చివేసి దాదాపు రూ.50 లక్షల వరకు నష్టం కలిగించారని పేర్కొన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని తెలిపారు.