BRS Party | మంచిర్యాల : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వస్తున్న స్పందన చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతుంది. ఈ నెల 27న వరంగల్ లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో చెన్నూరు పట్టణంలో వేసిన వాల్ రైటింగ్స్ను మున్సిపల్ అధికారులు చెరిపేశారు.
దీంతో అధికారుల తీరుపై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారని ధ్వజమెత్తుతున్నారు. వాల్ రైటింగ్స్ చెరిపేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపడ్డారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ వాల్ రైటింగ్స్ను తుడిచేయడం వెనుక కాంగ్రెస్ నేతల హస్తం ఉందని ఆయన ధ్వజమెత్తారు.
బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
ఈ నెల 27 న వరంగల్ లో నిర్వహించే బిఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో చెన్నూరు పట్టణంలో వేసిన వాల్ రైటింగ్ ని చెరిపేసిన మున్సిపల్ అధికారులు.#25YearsOfBRS#BRSat25 pic.twitter.com/fLt2TvGAI3
— Balka Suman (@balkasumantrs) April 19, 2025