హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంపు ఆఫీస్‌పై కాంగ్రెస్ మూకల దాడిని బీఆర్ఎస్-యూఎస్ఏ నాయకులు తీవ్రంగా ఖండించారు. శనివారం న్యూయార్క్‌లోని టైం స్క్వేర్ వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ రేవంత్ సర్కార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు మహేశ్ బిగాల, మహేశ్ , తిరుపతిరెడ్డి, రవీందర్ , నర్సింహారావు తదితరులు ఉన్నారు.