దుబాయ్, ఆగస్టు 5 : దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో పేలుళ్లు సంభవించినట్టు సమాచారం అందింది, 20 నిమిషాల వ్యవధిలో ఏడు పేలుళ్లు సంభవించాయని ఇరాన్‌కు చెందిన మెహర్ వార్తాసంస్థ తెలిపింది. ఈ ఘటనను చిత్రీకరించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు సమాచారం.
సంఘటన దాడి ఫలితమా లేక పారిశ్రామిక ప్రమాదమా అనేది ఇంకా తెలియరాలేదు. అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో యెమెన్ నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై క్షిపణి దాడి జరిగిందని ఇరాకీ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.