మహబూబ్‌నగర్ : మూడో విడుత ( Third phase ) పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా ( BRS Trend ) కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్( Mahabubnagar ) జిల్లాలో ఉన్న నారాయణపేట, మహబూబ్‌నగర్, వనపర్తి , నాగర్‌కర్నూల్ జిల్లాలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో 37 సర్పంచ్ స్థానాలకు ఇప్పటి వరకు పది సర్పంచ్ స్థానాల ఫలితాలు విడుదల కాగా. పదింటకి పది బీఆర్ఎస్ గెలుపొందింది. రెండు ఏకగ్రీవాలు కాగా ఇప్పటివరకు కాంగ్రెస్ ఖాతా తేరవలేదు. మంత్రి వాకిటి శ్రీహరి సొంత మండలంలో ప్రస్తుతం కాంగ్రెస్ గడ్డు పరిస్థితి నెలకొంది.

నారాయణపేట జిల్లా కృష్ణ మండలం కుసుమూర్తి సర్పంచ్ అభ్యర్థి మోనేష్ ( BRS) విజయం సాధించారు. మక్తల్ మండలం భగవాన్ పల్లి లో సుజాత ( బీఆర్ఎస్) , టేకులపల్లిలో శ్రవణ్ సర్పంచ్ (బీఆర్ఎస్) గెలుపొందారు. గుర్లపల్లిలో బీఆర్ఎస్ బలపరిచిన గాల్ రెడ్డి విజయ ఢంకా మోగించారు. మాగనూరు మండలం పర్మన్ దొడ్డి గ్రామ సర్పంచ్‌గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు.
మహబూబ్‌నగర్ భూత్ పూర్ మండలం లంబడికుంట తాండ సర్పంచ్ గా మాన్య నాయక్ బీఆర్ఎస్ ) , అన్నసాగర్ గ్రామంలో 10 వార్డు మెంబర్లు బీఆర్ఎస్ , మూసాపేట మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ గా రెడ్డి రాజు( బీఆర్ఎస్) అభ్యర్థులు ఘన విజయం సాధించారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అంకెన్ పల్లి లో భారత రాష్ట్ర సమితి మద్దతుదారురాలు గొల్ల రాజమ్మ 130 ఓట్లతో విజయ దుంధుబి మోగించారు.