అర్హులైన పేదలకు ఇండ్లు ఇవ్వాలి
ఖమ్మం జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హకులను పరిరక్షించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీలతో కలిసి గురువారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు భారీ ధర్నా నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బుధవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి మాట్లాడారు.
- నేడు కలెక్టరేట్ వద్ద బీఆర్ఎస్ పోరుబాట
- ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఖమ్మం కమాన్‌బజార్, అక్టోబర్ 21: ఖమ్మం జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల హకులను పరిరక్షించాలనే డిమాండ్లతో వామపక్ష పార్టీలతో కలిసి గురువారం ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు భారీ ధర్నా నిర్వహిస్తున్నట్టు బీఆర్ఎస్ నేత, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. బుధవారం ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఆ పార్టీ సమావేశంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి మాట్లాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేదని, కానీ నేడు గ్రామసభ తీర్మానం లేకుండా, ఇందిరమ్మ కమిటీల పేరుతో సొంత పార్టీ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ.. సర్పంచులు, వార్డుసభ్యుల హకులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలంతా అందినకాడికి దోచుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు లాటరీ పద్ధతిలో పారదర్శకంగా జరుపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులతో కూడిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి, సర్పంచులు ఇచ్చిన జాబితాను ఫైనల్ చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

