రేపే సింగరేణి కార్మిక గర్జన
సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో కదం తొక్కేందుకు కార్మికలోకం సమాయత్తమవుతున్నది. నల్ల సూర్యుళ్ల సమస్యలే ఎజెండాగా.. హకులు, హామీల అమలు సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘సింగరేణి కార్మిక గర్జన’కు సర్వం సిద్ధమవుతున్నది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగసభతో కార్మిక ఉద్యమానికి కొత్త ఊపు తీసుకురావాలని పార్టీ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయి.
- 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
- ముఖ్యఅతిథిగా హాజరుకానున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన టీబీజీకేఎస్, బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు గనుల ప్రాంతంలో కదం తొక్కేందుకు కార్మికలోకం సమాయత్తమవుతున్నది. నల్ల సూర్యుళ్ల సమస్యలే ఎజెండాగా.. హకులు, హామీల అమలు సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ తలపెట్టిన ‘సింగరేణి కార్మిక గర్జన’కు సర్వం సిద్ధమవుతున్నది. గోదావరిఖని సింగరేణి స్టేడియంలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగసభతో కార్మిక ఉద్యమానికి కొత్త ఊపు తీసుకురావాలని పార్టీ శ్రేణులు పట్టుదలతో పనిచేస్తున్నాయి.
బహిరంగసభకు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు బాల సుమన్, కోరుకంటి చందర్, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. సభా ప్రాంగణంలో ఏర్పాట్లను పరిశీలిస్తూ, జనసమీకరణకు అవసరమైన చర్యలపై నాయకులు దృష్టి సారించారు. సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత విధానాలను ఎండగట్టి, కార్మికుల హక్కులు, సంస్థను కాపాడుకునేందుకు ఈ నెల 14న పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియం వేదికగా బీఆర్ఎస్ సింగరేణి కార్మిక గర్జన సభ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.
టీబీజీకేఎస్ నేతలు సమావేశాలు, డివిజన్లవారీగా సమీక్షలతో కార్మికులను సమీకరించే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేస్తున్నారు. సింగరేణి కార్మికుల సమస్యలను ప్రధాన ఎజెండాగా చేసుకొని బీఆర్ఎస్ ఈ సభను నిర్వహించనున్నది. సభకు 20 వేల నుంచి 30 వేల మందిని సమీకరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 39 డివిజన్లలో సమన్వయంతో ముందుకు సాగుతూ సభను విజయవంతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరు కానుండటంతో సభపై రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి నెలకొన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

