హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి విమర్శనాస్ర్తాలు సంధించారు. ఆ ఇద్దరు రేవంత్, సంజయ్-ఆర్ఎస్ బ్రదర్స్‌లా వ్యవహరిస్తున్నారని అన్నారు. మూ సీ ప్రాజెక్టుపై ఆర్ఎస్ బ్రదర్స్ పొలిటికల్ డ్రామాను ఆపాలని హితవు పలికారు. ఇద్దరు లీడర్లు పబ్లిసిటీ కోసం ధర్నాల పేరి ట స్టంట్లు వేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.
రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే మూసీ ప్రాజెక్టుకు అనుమతులివ్వకుండా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి, మూసీ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు రు ణం రాకుండా చూడాలని అన్నారు. కానీ వీటిని పక్కనబెట్టి రాష్ట్రంలో కాంగ్రెస్‌తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీ అంతర్గతంగా అవగాహనతో వ్యవహరిస్తూ ప్రజల ముందు మాత్రం ప్రత్యర్థుల్లా ఫోజులు కొడుతున్నాయని వై సతీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. మూసీ నీళ్లతోనే రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, సంజయ్‌కి ప్రజలు అభిషేకం చేస్తారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హాయాం లో పదేపదే జోక్యం చేసుకున్న గవర్నర్, ఇప్పుడు లక్ష కుటుంబాలు రోడ్డున పడుతున్నా మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసమన్నారు.