BRS Silver Jubilee | హైదరాబాద్ మే 17 (నమస్తేతెలంగాణ): డాలస్‌లో జూన్ ఒకటిన అట్టహాసంగా నిర్వహించనున్న బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్ఎస్ యూఎస్ఏ విభాగం నాయకులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేటీఆర్ హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.
ఇప్పటికే వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజెలిస్, కాలిఫోర్నియా, అట్లాంటా, జార్జియా నగరాల్లో సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయని, వచ్చే 10 రోజుల్లో న్యూజె ర్సీ, బేఏరియా(కాలిఫోర్నియా), చికా గో, హోస్టన్,డాలస్, న్యూయార్క్ నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథిగా బాల్క సుమన్ హాజరై కార్యక్రమ ఏర్పాట్లు, ప్రచార వ్యూహాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారన్నారు. డాలస్‌లో వేడుకల్లో పాల్గొనేందుకు తెలంగాణ ప్రవాసీలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు.