ఇనుగుర్తి, జూన్ 28 : సాంస్కృతిక కళాకారిణి సట్ల అంజలి హత్యకు గురికావడం బాధాకరమని ఆమె కుటుంబానికి అండగా ఉంటానని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు భరోసా ఇచ్చారు.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలకేంద్రానికి చెందిన సట్ల అంజలి ఇటీవల హైదరాబాద్లోని జీడిమెట్లలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతురాలి కుటుంబ సభ్యులను శనివారం ఆయన పరామర్శించారు.