నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఏప్రిల్ 23: బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాలు సంబురంగా సాగుతున్నాయి. కార్యకర్తలు తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు. ఆత్మీయ పలుకరింపులతో సమ్మేళనాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరై.. కార్యకర్తల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆటపాటలతో సందడి చేస్తున్నారు. కార్యకర్తల కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేస్తున్నారు. ఆదివారం కూడా రాష్ట్రవ్యాప్తంగా సమ్మేళనాలు జరిగాయి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు.
మూసాపేటలో ‘ఆత్మీయ’ పిలుపు
మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండలం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతమైంది. పార్టీశ్రేణులు కుటుంబాలతో సహా తరలిరావడంతో ఈ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. దేవరకద్ర, జడ్చర్ల ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్యకర్తలకు భోజనాలు వడ్డించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
Brsmeeting1