మంచాలను కరువు మండలంగా ప్రకటించాలి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, జిల్లా నాయకుడు బియ్యాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం మంచాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు.
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా
మంచాల, అక్టోబర్ 28 : రంగారెడ్డిజిల్లా మంచాలను కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చీరాల రమేశ్, జిల్లా నాయకుడు బియ్యాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో బుధవారం మంచాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మంచాల మండలంలోని అన్ని గ్రామాల్లో 80 శాతం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఇప్పటికే 60 శాతం పంటలు ఎండిపోయి రైతులు నష్టాల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
నగరశివారు ప్రాంతాల్లో ని గండిపేట్, మహేశ్వరం, అబ్దుల్లాపూర్‌మెట్, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, బాలాపూర్ లాంటి వ్యవసాయ యోగ్యంలేని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి, మంచాలను కరువు మండలంగా ప్రకటించక పోవడం స్థానిక ఎమ్మెల్యే అసమర్థతేనని విమర్శించారు. వెంటనే మంచాల మండలంలో పంట నష్టం అంచనా వేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి కరువు మండలంగా ప్రకటించాలని, లేని పక్షంలో ప్రభుత్వంపై ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

