హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. దానం బీఆర్ఎస్ బీ-ఫాంపై ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారని.. ఇప్పుడు ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారని పిటిషన్లో తెలిపింది. సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా కూడా దానం పేరును కాంగ్రెస్ ప్రకటించిందని వివరించింది. ఈ విషయంపై మార్చి 18నే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు ఫిర్యాదు చేసినా స్పందించటం లేదని, అందుకే కోర్టును ఆశ్రయించినట్టు వెల్లడించింది. దానం అనర్హతపై త్వరగా చర్యలు తీసుకొనేలా స్పీకర్‌ను ఆదేశించాలని పిటిషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది.