BRS | రైతుల పక్షాన మరో పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం.. సాగునీటి ప్రాజెక్టుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యంపై పోరుకు రెడీ..
BRS | తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది.
BRS | హైదరాబాద్ : తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై తెలంగాణ రైతాంగం తరపున పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ రెడీ అయింది. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంపై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సారథ్యంలో త్వరలోనే కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నది. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు హాజరయ్యే ఈ ఉన్నతస్థాయి సమావేశంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అలసత్వం, రైతు వ్యతిరేక వైఖరిపై ప్రధానంగా చర్చిస్తారు.
రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మౌనం వహించడంపైన చర్చించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తి అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనబెట్టడంతో పాటు 2 పిల్లర్లు కుంగాయన్న సాకుతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నాయకులకు కేసీఆర్ వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో లక్షల ఎకరాల్లో రైతులకు సాగునీరు అందకుండా పోతున్నది. రాజకీయ దురుద్దేశంతోనే అన్నదాతలపైన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్న నేపద్యంలో తదుపరి కార్యాచరణ పై చర్చించనున్నారు.
ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా ప్రభుత్వం చూపుతున్న అలసత్వం వలన తెలంగాణకు తీరని నష్టం కలుగుతుందని, ఈ అంశంలో ఉద్యమ కార్యాచరణకు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేయనుంది. ఏడాదిన్నర కాలంగా తెలంగాణ రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్ ద్రోహాన్ని ఈ కీలక సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు సమగ్రంగా చర్చించనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

