Siddipeta | సిద్దిపేట : సిద్దిపేట నూతన రైల్వే స్టేషన్లో రైలు ప్రారంభం సందర్భంగా రైల్వే అధికారుల వైఖరి పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ ఫ్లెక్సీలో సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల కార్యకర్తల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.
రైల్వే లైన్ ఏర్పాటు, భూసేకరణ, స్టేషన్ల నిర్మాణం కోసం 60 శాతం నిధులు(సుమారు రూ. 1200 కోట్లు) కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను, రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటోలు వేయకపోవడం పట్ల బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు.