హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనారిటీలను పూర్తిగా విస్మరించారని బీఆర్ఎస్ పార్టీ ముస్లిం నేతలు విమర్శించారు. ముస్లిం నేతలు మసీఉల్లాఖాన్, అజాంఅలీ తదితరులు ఆదివారం తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఖబరస్థాన్‌లను కూల్చివేస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. షాదీముబారక్, తులం బంగారం, ఓవర్సీస్ స్కాలర్షిప్లు అమలుచేయడంలేదని దుయ్యబట్టారు. ఇమామ్‌లకు, మౌజీలకు రూ.పది వేలు ఇస్తామంటూ ఎన్నికల హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. వాటిని విస్మరించిందని, గత మూడు నెలలుగా వారికి గౌరవ వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి ముస్లిం మైనారిటీల పట్ల ఎందుకు వివక్ష చూపిస్తున్నారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి, బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ముస్లిం మైనారిటీలకు పిలుపునిచ్చారు. సమావేశంలో అబ్దుల్లా సొహైల్, అర్షద్ అలీ పాల్గొన్నారు.